లండన్ పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య యత్నం.. అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
- అమృత్ సర్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
- గత ఏడాదే అమృత్ పాల్ సింగ్, కిరణ్ దీప్ కౌర్ ల పెళ్లి
- పెళ్లి తర్వాత పంజాబ్ లోనే ఉంటున్న కిరణ్
ఈ మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో లండన్ వెళ్లేందుకు ఆమె అమృత్ సర్ విమనాశ్రయానికి వచ్చారు. ఇప్పటికే ఆమెపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎల్ఓసీ ని కూడా జారీ చేశారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోనే ప్రశ్నించారు.