Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జోరు పెంచుతున్న శ్రీముఖి .. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్!

Srimukhi Special
Advertisement
  • బుల్లితెరకి గ్లామర్ తెచ్చిన శ్రీముఖి 
  • భారీ ప్రాజెక్టుల నుంచి ఆఫర్లు 
  • ఆమె పాత్రలకి పెరుగుతున్న ప్రాధాన్యత
Advertisement
బుల్లి తెరపై శ్రీముఖి చేసే అందాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కేవలం శ్రీముఖి కోసమే ఆడియన్స్ ఫాలో అయ్యే కార్యక్రమాలు కొన్ని లేకపోలేదు. ఒక వైపున టీవీ షోస్ ను వదులుకోకుండానే, మరో వైపున సినిమాలలో కుదురుకోవడానికి శ్రీముఖి ట్రై చేస్తోంది. ఆ దిశగానే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. 

నిజానికి ఒక హీరోయిన్ కి కావలసిన గ్లామర్ శ్రీముఖిలో పుష్కలంగా ఉంది. ఆమెను పూర్తిగా సినిమాల వైపుకు వచ్చేయమనే అభిమానులు కూడా ఉన్నారు. కానీ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలతోనే సరిపెడుతూ వస్తోంది. ఇక గతంలో కంటే ఇప్పుడు ఆమె సినిమాల సంఖ్యను పెంచుతోందనే విషయం మాత్రం అర్థమవుతోంది. 

ప్రస్తుతం ఆమె చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఇక బాలయ్య - అనిల్ రావిపూడి సినిమాలోను ప్రత్యేకమైన పాత్రలో ఆమె కనిపించనుంది. వెంకటేశ్ .. నాగార్జున తాజా ప్రాజెక్టులలోను ఆమె పేరు వినిపిస్తోంది. ఇక తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో చెప్పుకోదగిన పాత్రకోసం ఆమెను తీసుకున్నారనేది టాక్. చూస్తుంటే శ్రీముఖి జోరు పెంచినట్టుగానే కనిపిస్తోంది కదూ. 
Advertisement
Advertisement
Srimukhi
Actress
Tollywood

More Telugu News