మానకొండూరులో అర్ధరాత్రి కాల్పుల కలకలం
- అరుణ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగులు
- మిస్ ఫైర్ కావడంతో తప్పించుకున్న యువకుడు
- దుండగులలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గొడవతో సంబంధంలేకున్నా అరుణ్ తలదాచుకున్న ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఆయుధాలతో ఇంట్లో వారిని బెదిరిస్తూ సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ గొడవ గురించి స్థానికులు సమాచారం అందించడంతో మానకొండూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దుండగులు నలుగురు పారిపోయారు. వెంటాడిన పోలీసులు ఇద్దరిని పట్టుకోగా.. మరో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో మానకొండూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.