మోదీపై అమెరికా మంత్రి పొగడ్తలు..వీడియో వైరల్
- ప్రధాని మోదీ నమ్మశక్యం కాని దార్శనికుడన్న అమెరికా వాణిజ్య శాఖ మంత్రి
- ప్రజలపట్ల ఆయన నిబద్ధత మాటల్లో వర్ణించలేమంటూ వ్యాఖ్య
- మంత్రి వ్యాఖ్యల వీడియో వైరల్
‘‘ఈ మధ్య నేను ఇండియాకు వచ్చి వెళ్లాను. హోలీ వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఓ రోజు ముందుగానే భారత్‌లో దిగాను. ఆ సమయంలో మోదీతో సమావేశమయ్యే అద్భుత అవకాశం దక్కింది. ఆయన నమ్మశక్యం కాని దార్శనికుడు, ప్రజలపై ఆయనకున్న నిబద్ధత మాటల్లో వర్ణించలేం. ప్రజలను పేదరికం నుంచి బయటపడేయాలని, భారత్‌ను ఓ ప్రపంచశక్తిగా ముందుకు నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇది వాస్తవరూపం దాలుస్తోంది’’ అని ఆమె ప్రసంగించారు. కాగా.. భారత్, అమెరికా మధ్య బలపడుతున్న దౌత్యబంధానికి అమెరికా మంత్రి వ్యాఖ్యలు ఓ సంకేతమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.