తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఫోకస్
- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో నేడు కేంద్ర ఈసీ బృందం భేటీ
- అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సూచనలు చేసిన ఈసీ
- ఆర్వోల జాబితా త్వరగా సిద్ధం చేయాలని సూచన
- ఈవీఎంల తనిఖీలు, జిల్లా ఎన్నికల అధికారులకు వర్క్ షాపులు ప్రారంభించాలని ఆదేశం
ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం పలు కీలక సూచనలు చేసింది. జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు రెండ్రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించాలని సూచించింది. ఓటర్ల జాబితాలో మార్పులుచేర్పులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పింది. రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేయాలని, జూన్ 1 నుంచి ఆర్వోలు ఈవీఎంల తనిఖీలు ప్రారంభించాలని ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది.