Prema: నా విడాకుల గురించి నేను చెప్పేమాట ఇదే: సీనియర్ హీరోయిన్ ప్రేమ

Prema Interview
షార్ట్స్‌లో చూడండి
1990లలో వెండితెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో ప్రేమ ఒకరు. కన్నడ సినిమాతో కథానాయికగా తన ప్రయాణాన్ని మొదలెట్టిన ఈ బెంగుళూరు భామ, 'ధర్మచక్రం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత 'ఓం కారం' .. 'మా ఆవిడ కలెక్టర్' .. 'దేవి' వంటి సినిమాలతో హిట్లు అందుకున్నారు. 

కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న ప్రేమ, తాజాగా సుమన్ టీవీతో మాట్లాడారు. "కొన్ని కారణాల వలన నేను విడాకులు తీసుకున్నాను. ఈ విషయాన్ని గురించి ముందుగా నేను మా పేరెంట్స్ తో మాట్లాడాను. వాళ్లు కూడా నా నిర్ణయం సరైనదేననే అభిప్రాయానికి వచ్చిన తరువాతనే ముందుకు వెళ్లాను" అన్నారు. 

"జీవితంలో కొన్ని సందర్భాలు ఎదురవుతాయి .. ఉన్నది ఒక్కటే జీవితం .. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి. కుంగిపోవడం .. ఆత్మ హత్యలు చేసుకోవడం వంటి పిచ్చిపనులు చేయకూడదు. చాలామందికి నేను ఈ విషయమే చెబుతుంటాను. జీవితంలో పెళ్లి అనేది ఒక భాగమే తప్ప .. పెళ్లే జీవితం కాదు" అని చెప్పుకొచ్చారు. 

Go Back to Shorts
Prema
Actress
Tollywood

More Telugu News