గుడివాడలో చంద్రబాబు రోడ్ షో... శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన
- నేడు నిమ్మకూరు నుంచి గుడివాడ వరకు రోడ్ షో
- గుడివాడ వీకేఆర్ కళాశాలలో సభ
ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో, భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అంతకుముందు, గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. రామనపూడి వద్ద గుడివాడ నియోజకవర్గంలోకి చంద్రబాబు రోడ్ షో ప్రవేశించింది. నియోజకవర్గ సరిహద్దుల వద్ద చంద్రబాబుకు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీ చేపట్టారు.
ఈ రాత్రికి చంద్రబాబు గుడివాడ జనార్దనపురంలోని వీకేఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతగా ఎన్ఎస్ జీ అదనపు బలగాలు రంగంలోకి దిగాయి.