రెండు వారాల్లో 'దసరా' రాబట్టిన లాభాలు ఎంతంటే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు వారాల్లో 'దసరా' రాబట్టిన లాభాలు ఎంతంటే..!

Dasara Movie Update
  • మార్చి 30వ తేదీన వచ్చిన 'దసరా' 
  • భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ప్రయాణం 
  • రెండువారాల్లో భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా
  • కీర్తి సురేశ్ కి పడిన సరైన హిట్టు
నాని - కీర్తి సురేశ్ జంటగా నటించిన 'దసరా' సినిమా, మార్చి 30వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలంగాణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రెండు వారాలను పూర్తిచేసుకుంది. 14 రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 24.98 కోట్లను వసూలు చేసింది. 

రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకుని ఈ సినిమా 43.31 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 111.05 కోట్ల గ్రాస్ ను .. 61.82 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంతవరకూ ఈ సినిమా 12.82 కోట్ల లాభాలను రాబట్టిందని అంటున్నారు. నాని కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించినదిగా ఈ సినిమా నిలిచింది. 

ఈ సినిమాలో ధరణి పాత్రలో నాని .. వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ మెప్పించారు. మాస్ లుక్ లోను .. యాసలోను .. డాన్సులలోను పోటీలు పడ్డారు. చాలాకాలం తరువాత కీర్తి సురేశ్ కి సరైన హిట్ పడిందని చెప్పుకోవాలి. తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెలకి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయనేది టాక్.
Advertisement
Nani
Keerthi Suresh
Srikanth Odela
Dasara Movie

More Telugu News