వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

union minister key comments on vizag steel plant
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదన్న కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్‌
  • ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచన చేయడం లేదని వ్యాఖ్య
  • ముందు అర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని వెల్లడి
  • బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం అనేది ఒక ఎత్తుగడ మాత్రమేనని విమర్శ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి తాము ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే వెల్లడించారు. గురువారం ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదు. ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ముందు అర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్) ను బలోపేతం చేసే పనిలో మేం ఉన్నాం. ప్లాంట్ లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోంది. అర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం’’ అని చెప్పారు. 

బిడ్ వేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న విషయంపై ఫగ్గన్ సింగ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం అనేది ఒక ఎత్తుగడ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. స్టీల్‌ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని.. ప్లాంట్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టామని వివరించారు.
Go Back to Shorts
Vizag Steel Plant
faggan singh kulaste
privatisation of rinl
Visakha Ukku

More Telugu News