Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంటవెంటనే రెండు భారీ హిట్లు .. అయినా కనిపించని శ్రుతి హాసన్ సందడి!

Sruthi Haasan Special
Advertisement
  • 'క్రాక్'తో హిట్ కొట్టిన శ్రుతి హాసన్ 
  • సంక్రాంతి కానుకగా రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్న బ్యూటీ 
  • ప్రస్తుతం చేతిలో ఉన్నది 'సలార్' మాత్రమే
  • కొత్త ప్రాజెక్టులలో కనిపించని శ్రుతి హాసన్ పేరు
Advertisement
హీరోయిన్ గా చాలామంది ఎంట్రీ ఇస్తుంటారు. కానీ వాళ్లలో స్టార్ స్టేటస్ కొంతమందికి మాత్రమే దక్కుతూ ఉంటుంది. తెలుగులో అలాంటి స్టార్ స్టేటస్ ను శ్రుతి హాసన్ ఎంతో కష్టపడి అందుకుంది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాలపై దృష్టిపెట్టిన ఆమె, ఇక్కడి నుంచి వెళ్లిన అవకాశాలను లైట్ తీసుకుంది. అయితే అక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం వలన, మళ్లీ ఇటువైపే పరిగెత్తుకొచ్చింది.

ఇక్కడ 'క్రాక్' హిట్ తో ఆమెకి ఊరట కలిగింది. ఈ సినిమాతోనే ఆమెకి ప్రభాస్ 'సలార్'లోను .. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోను .. బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి'లోను వరుస అవకాశాలు వచ్చాయి. 'సలార్' తప్ప మిగతా రెండు సినిమాలు ఒక రోజు తేడాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకదానికి మించి మరొకటి సంచలన విజయాలను నమోదు చేశాయి. 

ఇక ప్రభాస్ తో ఆమె చేస్తున్న 'సలార్' మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు ఒక ఇంగ్లిష్ మూవీ కూడా చేస్తోంది. 'సలార్' తరువాత తెలుగు .. తమిళ .. హిందీ భాషలకి సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా ఆమె చేతిలో లేవు. శ్రుతి ఎందుకిలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందనేది అభిమానులకు అర్థం కావడంలేదు. త్వరలో ఆమె నుంచి అప్ డేట్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి. 
Advertisement
Advertisement
Sruthi Haasan
Actress
Tollywood

More Telugu News