తెలంగాణ ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్ విందు... హాజరైన సీఎం కేసీఆర్
- కొనసాగుతున్న పవిత్ర రంజాన్ మాసం
- ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు
- హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు
- మైనారిటీల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామన్న కేసీఆర్
దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా పాటుపడతామని తెలిపారు. ఆవేశంతో కాకుండా, ఆలోచనతో దేశాన్ని పరిరక్షించుకుందామని అన్నారు. ఈ దేశం మనది... ఆఖరి రక్తపుబొట్టు వరకు దేశం కోసం పోరాటం సాగిద్దాం అని పిలుపునిచ్చారు.
మన గంగా యమునా తెహజీబ్ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమంగా గెలిచేది న్యాయమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు.