కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత

congress leader janareddy hospitalized
  • యశోద ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ లీడర్
  • గుండె రక్తనాళం పూడుకుపోయిందన్న వైద్యులు
  • జానారెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మంగళవారం నాడు జానారెడ్డి సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. మోకాలి చికిత్స కోసం ఆయన వైద్యులను కలిశారు.

ఈ క్రమంలోనే ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండె రక్తనాళాల్లో ఒకటి పూర్తిగా పూడుకుపోయిందని గుర్తించారు. ఇదే విషయం జానారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వివరించారు. వారి అనుమతితో మంగళవారం రాత్రి స్టెంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
Jana Reddy
Congress
heart problem
yashoda hospital

More Telugu News