కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత
- యశోద ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ లీడర్
- గుండె రక్తనాళం పూడుకుపోయిందన్న వైద్యులు
- జానారెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వెల్లడి
ఈ క్రమంలోనే ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండె రక్తనాళాల్లో ఒకటి పూర్తిగా పూడుకుపోయిందని గుర్తించారు. ఇదే విషయం జానారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వివరించారు. వారి అనుమతితో మంగళవారం రాత్రి స్టెంట్ వేశారు. ప్రస్తుతం జానారెడ్డి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.