థియేటర్లలో ఈ వారం సినిమాలు.. ఓటీటీలో ఈ వారం సిరీస్ లు ఇవే!
- పాన్ ఇండియా సినిమాగా ఈ నెల 14న వస్తున్న 'శాకుంతలం'
- ఈ నెల 14వ తేదీ నుంచి 'ఆహా'లో 'దాస్ కా ధమ్కీ' స్ట్రీమింగ్
- అదే రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో 'జూబ్లీ సీజన్ 2'
- జీ 5 నుంచి అదే రోజున వస్తున్న 'మిసెస్ అండర్ కవర్'
ఇక అదే రోజున లారెన్స్ 'రుద్రుడు' .. సూరి 'విడుదల' రిలీజ్ కానున్నాయి. ఈ రెండూ కూడా తమిళం నుంచి వచ్చిన అనువాదాలే. ఆల్రెడీ తమిళనాట 'విడుదల' భారీ వసూళ్లను రాబట్టగా, 'రుద్రుడు' మాత్రం తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ ముందుకు కూడా ఇదే రోజున రానుంది. లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది.
ఇక ఓటీటీ విషయానికి వస్తే .. ఈ నెల 13వ తేదీన ' ఓ కల' అనే తెలుగు సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున 'అసలు' తెలుగు సినిమా 'ఈటీవీ విన్' ద్వారా పలకరించనుంది. ఈ సినిమాలో రవిబాబు - పూర్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 14 నుంచి 'ఆహా' ద్వారా 'దాస్ కా ధమ్కీ' పలకరించనుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ లో 'జూబ్లీ' ( వెబ్ సిరీస్) సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. జీ 5లో 'మిసెస్ అండర్ కవర్' హిందీ మూవీ కూడా అదే రోజున స్ట్రీమింగ్ కానుంది.