రామోజీరావు నలుగురికీ నిజమైన మార్గదర్శిలా జీవిస్తున్నారు: రఘురామకృష్ణరాజు
- కీరవాణి చెప్పినట్టు ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలన్న రఘురాజు
- మార్గదర్శిపై ఏపీ సీఐడీ తప్పడు కేసులు పెట్టిందని విమర్శ
- న్యాయం రామోజీరావు వైపే ఉందని వ్యాఖ్య
మార్గదర్శిని మూసేస్తామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారి చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఐదు నెలల క్రితమే ఈ అధికారిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా జగన్ నియమించారని తెలిపారు. జగన్ కక్ష సాధింపుల్లో భాగంగానే మార్గదర్శిపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా గతంలో పని చేసిన వెంకట్రామిరెడ్డి... జగన్ కక్ష సాధింపులకు సహకరించి ఉండకపోవచ్చని, అందుకే ఆయనను జగన్ బదిలీ చేసి ఉంటారని అన్నారు.