ఉపాధ్యాయులంటే జగన్ కు ఎందుకంత చులకన?: అనగాని

TDP leader Anagani Sathya Prasad slams CM Jagan
టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులంటే జగన్ కు ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. ఏపీలో టీచర్లు ఉండాలా, వద్దా? వాళ్లు చేసిన తప్పేంటి? అని నిలదీశారు. సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ఉద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. టీచర్లపై రాజకీయ ఒత్తిడి తెచ్చి వ్యవస్థను నాశనం చేస్తున్నారని సత్యప్రసాద్ విమర్శించారు. 

ప్రతిదానికి ఉపాధ్యాయులను బలిచేస్తున్నారని, వారిని మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయులపై ఇకమీదటైనా ప్రభుత్వ వేధింపులు ఆపాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో ఉపాధ్యాయులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని వెల్లడించారు. 10వ పీఆర్సీ సమయంలో 4 శాతం పెంపుదలతో ఇచ్చామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Anagani Sathya Prasad
Teachers
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News