Samantha: అల్లు అర్హ కెరీర్ పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ శాకుంతలం చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేస్తోంది. శాకుంతలం చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అందాల సమంత అల్లు అర్హపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్హ కెరీర్ అద్భుతంగా సాగుతుందని పేర్కొంది. శాకుంతలం చిత్రంలో మిగతా పాత్రలతో పోల్చితే అర్హ పాత్ర ఉన్నతంగా ఉంటుందని వివరించింది. 

డైలాగ్ ఎంత పెద్దదయినా అర్హ తేలిగ్గా చెప్పగలదని ప్రశంసించింది. చిన్న పిల్లలు అర్హ పాత్రతో తప్పకుండా కనెక్ట్ అవుతారని సామ్ వెల్లడించింది. శాకుంతలం చిత్రం అర్హ కెరీర్ కు దివ్యమైన ప్రారంభం అవుతుందని పేర్కొంది. 

అర్హ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని, ఆమె ఆలోచనా శక్తి అమోఘం అని కితాబిచ్చింది. ముఖ్యంగా అర్హ కెరీర్ పై అల్లు అర్జున్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సమంత అభిప్రాయపడింది.
Samantha
Allu Arha
Sakuntalam
Allu Arjun
Tollywood

More Telugu News