బందీపూర్ పార్క్ లో మోదీ సఫారీ.. వీడియో ఇదిగో!
- ప్రాజెక్ట్ టైగర్ కు 50 పూర్తయిన సందర్భంగా 20 కిలోమీటర్లు సఫారీ
- ప్రత్యేక నాణాన్ని విడుదల చేయనున్న ప్రధాని మోదీ
- తమిళనాడులోని మదుమలై టైగర్ రిజర్వ్ సందర్శన
బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సఫారీ పూర్తయిన తర్వాత మైసూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రాజెక్ట్ టైగర్ 50 వసంతాల స్మారక నాణాన్ని విడుదల చేస్తారు. దేశంలోని పులుల గణనకు సంబంధించిన వివరాలను విడుదల చేస్తారు. అనంతరం తమిళనాడులోని మదుమలై టైగర్ రిజర్వ్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. అందులోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ ను ప్రధాని సందర్శిస్తారు. ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్’ ను చిత్రీకరించింది ఈ క్యాంపులోనేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్, వల్లిలతో పాటు రఘు (ఏనుగు) ను మోదీ కలుసుకుంటారని అధికారులు వివరించారు.