సహనం, సౌశీల్యం కలిగిన నేత నాదెండ్ల మనోహర్: పవన్ కల్యాణ్
- జనసేనలో పవన్ తర్వాత నాదెండ్ల మనోహరే!
- నేడు నాదెండ్ల పుట్టినరోజు
- శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
సహనం, సౌశీల్యం కలిగిన నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్పీకర్ గా సభను నడిపిన విధానాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని పవన్ పేర్కొన్నారు. జనసేన పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా నాదెండ్ల ఎంతో నేర్పుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.
పార్టీలోని క్షేత్రస్థాయి జనసైనికులు, వీర మహిళల నుంచి నేతల వరకు అందరినీ సమన్వయం చేస్తూ, ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన అనుభవం ఎంతో దోహదపడుతోందని తెలిపారు. నాదెండ్ల మనోహర్ కు సుఖసంతోషాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.