కేసీఆర్ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివని దేశమంతా నివ్వెరపోతోంది: ధర్మపురి అర్వింద్
- దేశ వ్యాప్తంగా విపక్షాలకు డబ్బులు పంపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారన్న అర్వింద్
- లక్షల కోట్లను కేసీఆర్ ఎలా సంపాదించారనే చర్చ కొనసాగుతోందని వ్యాఖ్య
- తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందన్న అర్వింద్
రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందని అర్వింద్ చెప్పారు. అందరినీ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని తన ఇంటికి కూడా పోలీసులు వచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాబోతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ అరెస్టే దానికి ఉదాహరణ అని చెప్పారు.