అమరావతి ఆర్-5 జోన్ పై విచారణ.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమన్న హైకోర్టు
- అమరావతిలో పేదలకు భూములు కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
- తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన హైకోర్టు
- కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఆర్డీఏలకు ఆదేశాలు
మరోవైపు ఈనాటి విచారణ సందర్భంగా రైతుల తరుపు లాయర్లు వాదిస్తూ... అమరావతి భూములను కేవలం రాజధాని అవసరాలకు మాత్రమే వినియోగించాలని గతంలోనే హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ భూమి పంపకాలకు ప్రభుత్వం జీవో జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పారు. రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం చట్ట విరుద్ధమవుతుందని తెలిపారు. జీవోపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.