త్వరలో యాపిల్‌లోనూ లేఆఫ్స్!
- యాపిల్ లేఆఫ్స్‌కు సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ వార్తాపత్రిక కథనం
- స్వల్ప స్థాయిలోనే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని వెల్లడి
- డెవలప్‌మెంట్ అండ్ ప్రిజర్వేషన్ విభాగంలో తొలగింపుల పర్వం
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో ఆర్థిక రంగం నెమ్మదిస్తుందన్న భయాందోళనలు అమెరికా కార్పొరేట్ రంగంలో వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికాలోని పలు భారీ కార్పొరేట్ సంస్థలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. ఫేస్‌బుక్‌లో మరో 10 వేల మందిని తొలగించబోతున్నట్టు సంస్థ యాజమాన్యం గతనెలలోనే ప్రకటించింది. ఓ భారీ టెక్ కంపెనీ ఇలా రెండో మారు లేఆఫ్స్ చేపట్టేందుకు రెడీ కావడం అప్పట్లో మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది.