జీవో నెం.45పై హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు
- సీఆర్డీఏ పరిధిలో ఇతర జిల్లాల వారికి భూముల కేటాయింపు
- జీవో నెం.45 తీసుకువచ్చిన ప్రభుత్వం
- లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన అమరావతి రైతులు
సీఆర్డీఏ పరిధిలో 1,130 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కింద కేటాయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో నెం.45 తీసుకువచ్చారు. అయితే ఆ భూములను ఇతరులకు కేటాయిస్తుండడాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.