రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్ మంజూరు
- మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు
- రాహుల్ పై పరువునష్టం కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ
- రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష
- కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాహుల్ పిటిషన్
అయితే, ఈ పరువునష్టం కేసులో కింది కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును ఏప్రిల్ 13 వరకు విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. కాగా, నేటి విచారణకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు.