ఇండియన్ ఐడల్13 విన్నర్ గా రిషి సింగ్.. బహుమతి ఎంతంటే?

  • ప్రముఖ సింగింగ్ రియాలిటీ షోలో మెప్పించిన ఆయోధ్య కుర్రాడు
  • ఫైనల్లో గెలిచి రూ. 25 లక్షల నగదు, బ్రీజా కారు సొంతం చేసుకున్న రిషి
  • తొలి రన్నరప్ గా దేబాస్మిత, రెండో రన్నరప్ గా చిరాగ్ కొత్వాల్
సోనీ చానల్ నిర్వహించే ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరానికి చెందిన రిషి సింగ్ విజేతగా నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి ముంబైలో జరిగిన కార్యక్రమంలో రిషి సింగ్ రూ.25లక్షల చెక్కు, మారుతి సుజుకి బ్రీజా కారును బహుమతిగా అందుకున్నాడు. కోల్ కతాకు చెందిన దేబాస్మితా రాయ్ తొలి రన్నరప్ గా నిలవగా, జమ్మూకశ్మీర్ సింగర్ చిరాగ్ కొత్వాల్ రెండవ రన్నరప్‌గా నిలిచాడు. వీరికి చెరో ఐదు లక్షల నగదు లభించింది.

గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కు సోనాక్షి కర్, శివమ్ సింగ్, బిదీప్త చక్రవర్తి చేరారు. హిమేష్, విశాల్ దద్లానీ, నేహా కక్కర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. టాప్6 పోటీదారులతో గట్టి పోటీని తట్టుకొని రిషి సింగ్ తన గాత్రంతో మెప్పించాడు. ఇక, అనాథ అయిన రిషి తన జీవితం గురించి వివరించాడు. తన తల్లిదండ్రులు తనను దత్తత తీసుకోకుంటే తాను మరణించి ఉండేవాడినని రిషి చెప్పాడు.

Indian Idol 13 Winner
Rishi Singh
Ayodhya

More Telugu News