Rahul Gandhi: పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

Rahul Gandhi To Challenge Prison Sentence In Gujarat Court
  • రేపు సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం
  • పరువు నష్టం కేసులో రాహుల్ కు రెండేళ్ల శిక్ష విధించిన కోర్టు
  • రాహుల్ లోక్ సభ సభ్యత్యాన్ని రద్దు చేసిన లోక్ సభ సెక్రటేరియట్
పరువు నష్టం కేసులో తనపై  విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారని సమాచారం. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు.. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటూ గడువు ఇచ్చింది. 

ఈ క్రమంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.
Rahul Gandhi
Prison
Sentence
Challenge
Gujarat Court

More Telugu News