కారులో వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై పెట్రోలు పోసి నిప్పటించిన దుండగులు!
- తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘటన
- కారులోనే సజీవ దహనమైన బాధితుడు
- బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్న నాగరాజు
- కారులో స్వగ్రామం వెళ్తుండగా ఘటన
- కారును ఆపి ఆపై ఘాతుకానికి పాల్పడిన దుండగులు
బాధితుడిని వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజుగా గుర్తించారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆయన పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఘటనకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.