మార్చి నెల జీఎస్టీ వసూళ్ల వివరాలు వెల్లడించిన కేంద్రం
- మార్చి నెలలో రూ.1,60,122 కోట్ల వసూళ్లు
- రెండోసారి రూ.1.6 లక్షల కోట్లు దాటిన వసూళ్లు
- రికార్డుస్థాయిలో ఐజీఎస్టీ వసూలు
- గత మార్చితో పోల్చితే జీఎస్టీలో 13 శాతం వృద్ధి
ఐజీఎస్టీ కింద రూ.82,907 కోట్లు వసూలైంది. ఐజీఎస్టీ వసూళ్ల పరంగా ఇది ఆల్ టైమ్ రికార్డు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఐజీఎస్టీ వసూలు కాలేదు. ఇక, మార్చి నెలలో సెస్ ల రూపంలో రూ.10,355 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది.
మొత్తమ్మీద గత మార్చి నెలతో పోల్చితే ఈ మార్చి నెల వసూళ్లలో 13 శాతం వృద్ధి నమోదైంది. కాగా, జీఎస్టీ తీసుకువచ్చాక ఇప్పటివరకు రెండు పర్యాయాలు మాత్రమే వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు దాటాయి.