రాహుల్ అనర్హతపై దిగ్విజయ్ వర్సెస్ కపిల్ సిబల్
- రాహుల్ కు మద్దతిచ్చిన జర్మనీకి ధన్యవాదాలు చెప్పిన దిగ్విజయ్
- దీన్ని తప్పుబట్టిన కపిల్ సిబల్
- విదేశాల మద్దతు మనకు అవసరం లేదని ట్వీట్
ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా దెబ్బతింటోందో గమనించినందుకు జర్మనీకి ధన్యవాదాలు చెప్పినట్టు దిగ్విజయ సింగ్ తెలిపారు. కానీ, మనం ముందుకు నడవడానికి ఊతకర్రలు అవసరం లేదనేది నా అభిప్రాయం. అలాగే, ఈ అంశంలో విదేశాల నుంచి మనకు మద్దతు అవసరం లేదు. మన పోరాటం మనదే. పోరాటంలో మనమంతా కలిసికట్టుగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఉంటోందని వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం పార్లమెంటు సచివాలయం వయనాడ్ లోక్‌సభ సభ్యత్వానికి రాహుల్ అనర్హుడని ప్రకటించింది.