శ్రీరామనవమి స్పెషల్: 'రామబాణం' నుంచి డైలాగ్ టీజర్!
- గోపీచంద్ హీరోగా 'రామబాణం'
- అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో నడిచే కథ
- శ్రీవాస్ దర్శకత్వంలో ఇది మూడో సినిమా
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నుంచి, 'శ్రీరామనవమి' సందర్భంగా ఒక డైలాగ్ టీజర్ ను వదిలారు. 'ఆ రాముడికి లక్ష్మణుడు .. హనుమంతుడు అనే ఇద్దరు ఉంటారు. ఈ రాముడికి ఆ ఇద్దరూ నేనే' అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ హైలైట్.
ఈ టీజర్ ను బట్టి ఈ సినిమాలో జగపతిబాబు - గోపీచంద్ అన్నదమ్ములుగా కనిపించనున్నారనే విషయం అర్థమవుతోంది. అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం స్పష్టమవుతోంది. డింపుల్ హయతి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఖుష్బూ .. నాజర్ .. సచిన్ ఖేడేకర్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.