Bellamkonda Sinivas: 'ఛత్రపతి'గా బెల్లంకొండ శ్రీనివాస్ .. హిందీ టీజర్ రిలీజ్

  • ప్రభాస్ క్రేజ్ పెంచిన రాజమౌళి 'ఛత్రపతి'
  • అదే సినిమాను హిందీలో రీమేక్ చేసిన వినాయక్ 
  • హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ 
  • మే 12వ తేదీన సినిమా విడుదల
Chatrapathi teaser released

ప్రభాస్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'ఛత్రపతి' ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2005లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. మాస్ హీరోగా ప్రభాస్ క్రేజ్ ను మరింతగా పెంచిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమాను అదే టైటిల్ తో హిందీలోకి రీమేక్ చేశారు. 

తెలుగులో మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా రూపొందింది. సిక్స్ ప్యాక్ తో కనిపించడం కోసం గట్టి కసరత్తునే చేసి బెల్లంకొండ కెమెరా ముందుకు వెళ్లాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, వీవీ వినాయక్ దర్శకత్వం వహించాడు.

 కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ మాస్ యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. మే 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో మార్కెట్ పెంచుకోవాలనే శ్రీనివాస్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి.

More Telugu News