యాదాద్రి వార్షిక ఆదాయం రూ.169 కోట్లు
- ఆలయ పునః నిర్మాణం తర్వాత పెరిగిన భక్తుల రద్దీ
- మూడు రెట్లు పెరిగిన ఆదాయం
- రూ. 1200 కోట్లతో ఆలయాన్ని తీర్చిదిద్దిన ప్రభుత్వం
టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కల్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా రోజువారీ ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2021-22 ఏడాదిలో దాదాపు 73 లక్షల మంది వచ్చేవారని, ఆలయ పునరుద్ధరణ తర్వాత అనేక సౌకర్యాలు కల్పించడంతో భక్తుల సంఖ్య 86 లక్షలకు చేరుకుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1200 కోట్లు వెచ్చించి ఆలయాన్ని తీర్చిదిద్దింది. రవాణా, వసతి సహా అనేక సౌకర్యాలు పెంచడం, హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో సాధారణ రోజుల్లో రోజుకు ఐదు వేల మంది.. వారంతాల్లో 40 వేల మంది వరకు దర్శనానికి వస్తున్నారని అధికారులు తెలిపారు.