25 రోజుల్లో 'బలగం' తెచ్చిన లాభం ఎంతంటే..!

Balagam movie update
  • ఈ నెల 3వ తేదీన వచ్చిన 'బలగం'
  • నిన్నటితో 25 రోజులను పూర్తిచేసుకున్న సినిమా 
  • తెలుగు రాష్ట్రాల్లో 24.29 కోట్ల గ్రాస్ వసూలు 
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సినిమా
కంటెంట్ ఉంటే దానికి స్టార్స్ హెల్ప్ అవుతారు .. అంతేగానీ కేవలం స్టార్స్ వల్లనే సినిమా ఆడుతుందనేది నిజం కాదనే విషయం చాలాసార్లు రుజువైంది. కంటెంట్ ఉంటే స్టార్స్ తో పనిలేదనే విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు నిరూపిస్తూ వస్తున్నాయి. అలాంటి సినిమాలలో ఒకటిగా 'బలగం' నిలిచింది. 

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వేణు దర్శకుడిగా ఈ సినిమా రూపొందింది. ఈ నెల 3వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. విడుదలకి ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా, మౌత్ టాక్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించిన జీవనచిత్రంగా ప్రశంసలను అందుకుంది. 

అలాంటి ఈ సినిమా నిన్నటితో 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 25 రోజులలో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.29 కోట్ల గ్రాస్ ను .. 11.14 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 16.75 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చెబుతున్నారు. ఇంతవరకూ ఈ సినిమా 10 కోట్లకి పైగానే లాభాలను రాబట్టిందని అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. 

Go Back to Shorts
Priyadarshi
Kavya
Venu
Dil Raju
Balagam Movie

More Telugu News