Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందాల పాయల్ ఇప్పుడు ఎక్కడ?

Payal Rajputh Special
Advertisement
  • పొడగరి భామగా మార్కులు కొట్టేసిన పాయల్ 
  • రొమాంటిక్ బ్యూటీగా యూత్ లో క్రేజ్ 
  •  సినిమాల్లో తగ్గిన అవకాశాలు
  • వెబ్ సిరీస్ లలోను కనిపించని వైనం
Advertisement
పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే అజంతా గుహలో నుంచి అప్పుడే బయటికి వచ్చిన అందాల శిల్పం గుర్తుకు వస్తుంది. పాయల్ మంచి పొడగరి ... ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. చక్కని కనుముక్కు తీరుతో అప్పుడే విరిసిన కలువలా కనిపిస్తుంది. కళ్లతోనే వీలైనన్ని విన్యాసాలు చేయడం ఆమె ప్రత్యేకత. 

మొదటి నుంచి కూడా పాయల్ పొలోమంటూ సినిమాలు చేస్తూ వెళ్లిందేమీ లేదు. నిదానంగానే ఒక్కో సినిమా చేస్తూ వెళ్లింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ, హాట్ లుక్స్ తో కుర్రాళ్లను మనసులను కూడగట్టుకుంది. రొమాంటిక్ సీన్స్ లో రొటీన్ కి భిన్నంగా కనిపిస్తూ మంచి మార్కులు కొట్టేసింది. 

సరైన సినిమా పడితే ఈ సుందరిని పట్టుకోవడం కష్టమని చాలామంది అనుకున్నారు. అలాంటి సినిమాల కోసం వెయిట్ చేస్తూనే ఆమె వెబ్ సిరీస్ లపై కూడా దృష్టిపెట్టింది. ఇక ఇప్పుడు అటు సినిమాల్లోగానీ .. ఇటు వెబ్ సిరీస్ లలో గాని ఆమె పేరు వినిపించడం లేదు. మరి ఈ అందాల చందమామ ఏం చేస్తోంది? అందుబాటులో లేకుండా వెళ్లిపోదు కదా? అని కుర్రాళ్లంతా డీలాపడిపోతున్నారు. 
Advertisement
Advertisement
Payal
Actress
Tollywood

More Telugu News