కోహ్లీ జెర్సీ నెంబర్ వెనక కన్నీటి కథ
- 2006 డిసెంబర్ 18న కోహ్లీ తండ్రి మరణం..
- అదే రోజు రంజీ మ్యాచ్ ఆడిన టీమిండియా మాజీ సారథి
- తన తండ్రి గుర్తుగా నెంబర్ 18 జెర్సీ ధరిస్తున్నట్లు చెప్పిన కోహ్లీ
2006 డిసెంబర్ 18వ తేదీ.. తన జీవితంలో మర్చిపోలేని రోజు అని కోహ్లీ చెప్పాడు. ఆ రోజు కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ ఆడాల్సి ఉంది. అయితే, అదేరోజు తెల్లవారుజామున కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో చనిపోయారు. పదిహేడేళ్ల వయసున్న కోహ్లీ దు:ఖం దిగమింగి వెళ్లి మ్యాచ్ ఆడాడు. ఆ రోజు 90 పరుగులు చేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఈ ఘటనపై కోహ్లీ మాట్లాడుతూ.. తండ్రి మరణించిన రోజు తాను వ్యక్తిగా మారానని తెలిపాడు. కఠిన నిర్ణయాలు తీసుకున్నానని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ లోకాన్ని వీడిపోయిన తన తండ్రి గర్తుగా ఆ జెర్సీని ధరిస్తున్నానని కోహ్లీ చెప్పాడు.