రాహుల్ సిప్లిగంజ్ ను సన్మానించి ఆసక్తికర ట్వీట్ చేసిన సీవీ ఆనంద్
- తన కార్యాలయంలో శాలువతో సత్కరించిన హైదరాబాద్ సీపీ
- ధూల్ పేట యువకుడు నగర ఖ్యాతిని విస్తృత పరిచాడని ప్రశంస
- హిందీతో పాటు తెలుగులో ట్వీట్ చేసిన ఆనంద్
‘నిన్న నేను మన ధూల్‌పేట్ కి చెందిన యువకుడు రాహుల్ సిప్లిగంజ్ ను నా ఆఫీసులో కలిశాను. ఇతను మన నగరం పేరు ప్రపంచంలోనే చాలా విస్తృత పరిచాడు. అది కూడా ఎక్కడా? లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో నాటు నాటు పాట పాడి! మన అందరికీ ఇది గర్వకారణం. ఎందుకంటే ఇతను మన హైదరాబాదీ గనుక’ అని ఆనంద్ ట్వీట్ చేశారు.