పవన్ .. సాయితేజ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
- తమిళంలో హిట్ కొట్టిన 'వినోదయా సితం'
- ఆ సినిమా రీమేక్ లో చేస్తున్న పవన్ - సాయితేజ్
- దర్శకత్వం వహిస్తున్న సముద్రఖని
- జులై 28వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో పవన్ ది ప్రధానమైన పాత్ర అనీ .. సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కథ అంతా కూడా సాయితేజ్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.
తమిళంలో కూడా చాలా తక్కువ రోజుల్లో షూటింగు పూర్తిచేసుకున్న సినిమా ఇది. అందువలన ఇక్కడ కూడా అదే స్పీడ్ తో పూర్తిచేయనున్నారు. జులై 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. కొంతసేపటి క్రితం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.