కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన స్టొయినిస్... వీడియో ఇదిగో!
- చెన్నైలో భారత్, ఆసీస్ చివరి వన్డే
- టీమిండియా ఇన్నింగ్స్ లో ఆసక్తికర సంఘటన
- కోహ్లీని బలంగా ఢీకొట్టిన స్టొయినిస్
- కోపంగా ఓ లుక్కేసిన కోహ్లీ
- నవ్వుకుంటూ వెళ్లిపోయిన స్టొయినిస్
టీమిండియా ఇన్నింగ్స్ లో 21వ ఓవర్ ను స్టొయినిస్ విసిరాడు. ఆ ఓవర్లో కోహ్లీ క్రీజులోకి వస్తుండగా, స్టొయినిస్ బలంగా ఢీకొట్టాడు. కోహ్లీ తనదైన శైలిలో ఓ సీరియస్ లుక్ విసిరి వెళ్లిపోయాడు. స్టొయినిస్ నవ్వుకుంటూ బౌలింగ్ పాయింట్ వద్దకు చేరుకోవడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.