తమిళనాడులో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు... 8 మంది మృతి
- కాంచీపురంలో విషాద ఘటన
- ఒక్కసారిగా పేలిపోయిన బాణసంచా కర్మాగారం
- మంటల్లో కాలిపోయిన కార్మికులు
- 19 మందికి తీవ్ర గాయాలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. పేలుడు జరిగిన బాణసంచా పరిశ్రమ వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
ఉష్ణోగ్రతలో చోటుచేసుకున్న మార్పు కారణంగా బాణసంచా పరిశ్రమలోని రసాయనాలు విస్ఫోనం చెంది ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, ఈ పేలుడు ధాటికి సమీపంలోని పలు మూగజీవాలు కూడా మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.