తెలుగు ప్రజలకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు: సీఎం జగన్

  • ముగిసిన శ్రీ శుభకృత్ నామసంవత్సరం
  • రేపు తెలుగు సంవత్సరాది ఉగాది
  • శ్రీ శోభకృత్ నామసంవత్సరంలోకి ప్రవేశం
  • ప్రజలందరికీ శుభం జరగాలని సీఎం జగన్ ఆకాంక్ష
రేపు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ స్పందించారు. తెలుగు ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం జరగాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వానలు కురవాలి, రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఇల్లు కళకళలాడాలని, మన సంస్కృతి వెల్లివిరియాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

Jagan
Ugadi
Wishes
Andhra Pradesh
YSRCP

More Telugu News