టెస్లా కార్ల ‘నాటు నాటు’ స్టెప్పులకు రాజమౌళి ఫిదా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టెస్లా కార్ల ‘నాటు నాటు’ స్టెప్పులకు రాజమౌళి ఫిదా!

SS Rajamouli Is Truly Overwhelmed By Tesla Light Shows Naatu Naatu Tribute
  • ‘నాటు నాటు’ పాటపై టెస్లా లైట్ షో
  • కార్ల లైట్లు ఆరుతూ వెలుగుతూ లయబద్ధంగా విన్యాసాలు
  • నిజంగా పొంగిపోతున్నానంటూ రాజమౌళి ట్వీట్
  • అద్భుతమైన ప్రదర్శన అని వ్యాఖ్య
‘నాటు నాటు’ సందడి ఇంకా తగ్గలేదు. ఆస్కార్ అవార్డు వచ్చాక.. మరింత పెరిగింది. ఇటీవల ఢిల్లీలో కొరియా దౌత్య సిబ్బంది, జర్మన్ ఎంబసీ ఉద్యోగులు నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో 150కి పైగా టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు ఆరిపోతూ వెలుగుతూ లయబద్ధంగా చేసిన విన్యాసాలు అదిరిపోయాయి. ఎంతో మందిని ఆకర్షించాయి. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ‘‘నాటు నాటుకి మీరు ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ కి నేను నిజంగా పొంగిపోతున్నా. ఇది ఒక అద్భుతమైన ప్రదర్శన” అంటూ ట్వీట్ చేశారు.

అలాగే ఆ షో నిర్వహించిన నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ సభ్యులు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, ఈ లైట్ షోలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘అందరి ప్రేమకు ధన్యవాదాలు’’ అని ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ట్వీట్ చేసింది. మరోవైపు టెస్లా కార్ల లైట్ షోపై ట్విట్టర్ సీఈవో, టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం. రెండు లవ్ సింబల్స్ ను ఆయన ట్వీట్ చేశారు.
Advertisement
Rajamouli
Naatu Naatu
Tesla Light Show
RRR

More Telugu News