పేపర్ లీకేజీపై హైకోర్టులో కీలక విచారణ.. హాజరైన రేవంత్ రెడ్డి
- కేసును సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిటిషన్
- పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ వివేక్ తన్కా
- కేసులో ఇద్దరికే సంబంధం ఉందని మంత్రి కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్న
పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్, ఆయన పీఏకు సంబంధం ఉందని చేసిన ఆరోపణలపై ఆధారాలు కోరుతూ సిట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు లీకేజీ కేసులో అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను సిట్ నాలుగో రోజు కూడా విచారిస్తోంది. ప్రధానంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ను ఇంకెవరెవరికి చేరవేశారనే విషయాలను ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రధాన నిందితులు ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది.