ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల సందడి.. వివరాలు ఇవిగో!
- ఈ నెల 31 నుంచి ఐపీఎల్ తాజా సీజన్
- ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్ లు
- భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాచకొండ సీపీ
- టికెట్లు బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఏప్రిల్ 9- సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్
ఏప్రిల్ 18- సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
ఏప్రిల్ 24- సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
మే 4- సన్ రైజర్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
మే 13- సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
మే 18- సన్ రైజర్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఈ సందర్భం సీపీ చౌహాన్ మాట్లాడుతూ... టికెట్ల విషయంలో గందరగోళం చోటుచేసుకోకుండా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మ్యాచ్ లకు భద్రత కల్పించడంపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని, స్టేడియం చుట్టూ అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.