కవితకు ధైర్యం చెప్పి ఈడీ కార్యాలయంలోకి పంపిన ఆమె భర్త.. రెండున్నర గంటలుగా కొనసాగుతున్న విచారణ
- రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత
- కవితను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న భర్త అనిల్
- ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
మరోవైపు ఈడీ కార్యాలయంలోకి వెళ్లే ముందు కవితను ఆమె భర్త అనిల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ధైర్యం చెప్పి లోపలకు పంపించారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఆమె చేతిలో డాక్యుమెంట్ లాంటి పేపర్ ఉంది. ఈడీ అడిగిన వివరాలను నేరుగా అందించేందుకు కవిత ఆ పేపర్ ను తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వెళ్లారు.