వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్
- ఏ-4 నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా చూపడంపై సవాల్
- సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడని ఆరోపణ
- హత్యలో కీలక పాత్ర పోషించిన నిందితుడికి బెయిల్ ఇవ్వడం సరికాదు
వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని, అలాంటి నిందితుడికి బెయిల్ ఇవ్వడం సరికాదని భాస్కర్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకించాలన్నారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే.. దస్తగిరి బెయిల్ సమయంలోనూ సీబీఐ సహకరించిందని ఆరోపించారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్ట్ పట్టించుకోలేదన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.