టీడీపీ అభ్యర్థికి పెరుగుతున్న ఆధిక్యం.. కింద కూర్చుని నిరసన తెలిపిన వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి
- ఏపీలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన టీడీపీ
- పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీకి ఆధిక్యం
- 1,009 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి
అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కింద కూర్చుని నిరసన తెలిపారు.
కౌంటింగ్ కేంద్రం వెలుపల వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం నినాదాలు చేశారు. వైసీపీ నేతలు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.