అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ
- రెండేళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఫేస్‌బుక్, యూట్యూబ్
- తాజాగా నిషేధం ఎత్తివేత
- ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ తొలి వీడియో పోస్ట్ చేసిన ట్రంప్
ఇక శుక్రవారం ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ట్రంప్ అధికారిక అకౌంట్లను పునరుద్ధరించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ వీడియోలు ఆ రెండు వేడుకల్లోనూ దర్శనమిచ్చాయి. ‘‘మిమ్మల్ని ఇంతకాలం వెయిట్ చేయించినందుకు సారీ’’ అని ట్రంప్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ఇక వీడియో చివర్లో.. ‘ట్రంప్ 2024’ అన్న టైటిల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2016 నాటి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌పై గెలిచి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్.. ఆ తరువాతి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి చెందారు. ఇక 2024లో జరిగే ఎన్నికల్లో బైడెన్‌ను మట్టి కరిపించి తన ఆధిపత్యం చాటుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు.