ఢిల్లీలో జగన్ ను కలిసిన వైఎస్ అవినాశ్ రెడ్డి

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్
  • అవినాశ్ ను అరెస్ట్ చేయొద్దని చెప్పలేమన్న టీఎస్ హైకోర్టు
  • ఈ పరిణామం తర్వాత జగన్ ను కలిసిన అవినాశ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ను వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కలిశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తనపై అరెస్ట్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అవినాశ్ రెడ్డి వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అవినాశ్ ను అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామం చోటు చేసుకున్న కాసేపటికే ఢిల్లీలో ఉన్న జగన్ ను అవినాశ్ కలిశారు. జగన్ నివాసంలోనే అవినాశ్ ఉన్నట్టు తెలుస్తోంది. అవినాశ్ తో మాట్లాడిన తర్వాత మోదీని కలిసేందుకు జగన్ పార్లమెంటుకు వెళ్లారు. కాసేపటి క్రితమే మోదీతో జగన్ భేటీ ముగిసింది.

YS Avinash Reddy
Jagan
YSRCP
Delhi

More Telugu News