కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చీతా
- అరుణాచల్ ప్రదేశ్ లోని బొమ్డిల పట్టణంలో క్రాష్
- అందులోని ఇద్దరు పైలట్ల గల్లంతు
- వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
దీనిలో పైలట్లుగా ఓ లెఫ్టినెంట్ కల్నల్, ఓ మేజర్ ఉన్నట్లు సమాచారం. గాలింపు బృందాలను రంగంలోకి దించినట్లు ఈ ప్రకటన వెల్లడించింది. వైమానిక దళంలో చేతక్, చీత రకం హెలికాప్టర్లు 200 వరకు సేవలు అందిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాలలో సాయుధ బలగాలకు ఇవి రక్షణగా ఉన్నాయి. కానీ, పాతబడుతున్న నేపథ్యంలో వీటి స్థానాల్లో కొత్త వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది.