మా పెళ్లయిన మూడో రోజు నుంచే గొడవలు మొదలు: రామ్ గోపాల్ వర్మ
- తన పెళ్లి గురించి ప్రస్తావించిన వర్మ
- ప్రేమలో వున్నప్పుడు ఎవరూ బయటపడరని వ్యాఖ్య
- పెళ్లి తరువాత నిజాలు బైటికి వస్తాయని వెల్లడి
- గొడవలు జరిగినప్పుడు పారిపోయేవాడినని వ్యాఖ్య
"నాకు .. రత్నకి పెళ్లి జరిగిన తరువాత కూడా నేను ఇంటి పట్టున ఉన్నది చాలా తక్కువ. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఒకసారి రత్న నా కాలర్ పట్టుకుని గోడకి అదిమి పట్టేసింది. అది చూసిన మా నాన్నగారు కంగారు పడిపోయి అరిచేశారు. నేను పెరట్లో నుంచి పారిపోయాను. రత్న ఎంతగా అరిచినా నేను పెద్దగా రియాక్ట్ అయ్యేవాడిని కాదు. ఒక మనిషి రియాక్ట్ కాకపోతే అవతల వ్యక్తికి మరింత కోపం వస్తుంది.
అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ రావాలనే ఉద్దేశంతో ఫిజికల్ గా గొడవపడటానికి రెడీ అవుతారు. రత్న చేసింది కూడా అదే. అలాంటప్పుడు తప్పించుకోవడానికి నేను పారిపోయేవాడిని. ఒకసారి మా బిల్డింగ్ పై నుంచి మరో బిల్డింగ్ పైకి దూకేసి మరీ వెళ్లిపోయాను. ఆ రాత్రంతా బంజారా హిల్స్ రోడ్లపై తిరుగుతూ గడిపేశాను" అంటూ చెప్పుకొచ్చారు.